
(trp full form) అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్, ఇది టెలివిజన్ ప్రోగ్రామ్‌లు మరియు ఛానెల్‌ల ప్రజాదరణను నిర్ణయించడానికి ఉపయోగించే కొలత. TRP ఎక్కువగా ఉంటే, ఎక్కువ మంది వ్యక్తులు నిర్దిష్ట ప్రోగ్రామ్ లేదా ఛానెల్‌ని చూస్తున్నారు. TRPలు బ్రాడ్‌కాస్టర్‌లకు ఏ షోలు ఎక్కువగా వీక్షించబడుతున్నాయో అంచనా వేయడానికి సహాయపడతాయి, తద్వారా వారు తదనుగుణంగా ప్రోగ్రామింగ్ నిర్ణయాలు తీసుకోగలరు.
TRP ని ఎలా లెక్కిస్తారు?
- భారతదేశంలో, టీవీ ఛానల్స్ యొక్క రేటింగులను లెక్కించడానికి BARC అనే సంస్థ ఉంది. BARC అంటే Broadcast Audience Research Council.
- ఈ సంస్థ దేశంలోని కొన్ని వేల ఇళ్ళల్లో ప్రత్యేకమైన పరికరాలను అమర్చుతుంది. ఈ పరికరాలు ఛానల్ల నుండి వచ్చే ఆడియోలోని వాటర్ మార్కింగ్ ద్వారా ఏ సమయంలో, ఎంతమంది, ఏ ఛానల్ను చూస్తున్నారో రికార్డు చేసి BARC సర్వర్లకు పంపుతాయి.
- ఈ పరికరాల ఖర్చు ఎక్కువగా ఉండటంవల్ల, అన్ని టీవీ ఛానల్స్కు వీటిని అమర్చడం సాధ్యపడదు. కాబట్టి కేవలం కొన్ని టీవీ ఛానల్స్కు మాత్రమే వీటిని అమర్చతారు.
TRP ని ఎలా చెక్ చెయ్యాలి?
- మీరు మన దేశంలో ఏ ఛానల్‌కు ఎంత trp rating ఉందో లేదా ఏ ప్రోగ్రామ్‌ను ఎక్కువ మంది చూస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే, http://www.barcindia.co.in/statistic.aspx ఈ వెబ్‌సైట్‌లో మీకు కావాలిసన ఛానల్‌కు సంబంధించిన డేటాను పొందవచ్చు.
అసలు TRP ఎందుకు?
- సాధారణంగా వివిధ కంపెనీలు ఏ ఛానల్‌కు లేదా ప్రోగ్రామ్‌కు ఎక్కువ ప్రేక్షకబాష్పం ఉందో ఆ ఛానల్ లేదా ప్రోగ్రామ్‌లో తమ ప్రకటనలను ప్రసారం చేయాలని చూస్తారు.
- ఈ సమయంలో వారు ఛానల్‌ను ఎంపిక చేసుకోవడంలో trp ఆధారంగా ఉంటారు. ఇలాగే ఏ ఛానల్‌కు ఎక్కువ TRP ఉంటే వారు తమ ప్రకటనలను ప్రసారం చేయడానికి ఎక్కువ డబ్బు తీసుకుంటారు.
- టీవీ ఛానల్స్‌కు వచ్చే ఆదాయం మొత్తం ఈ ప్రకటనల ద్వారానే వస్తుంది. వారి ఛానల్ trp పెరిగితే వారికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది.
- ఈ కారణంతో తమ TRPని పెంచుకోవడానికి టీవీ ఛానల్స్ వివిధ రకాల ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తూ ఉంటాయి.
========================================================================
ఇంటర్నెట్ అంటే ఏమిటి?.....CLICK HERE
0 Comments