NAVIC(నావిక్)-India's Own Navigation System in Telugu

NAVIC: భారతదేశపు సొంత నావిగేషన్ సిస్టం:
- మనకూ తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే, ఇతరుల సహాయంతో వెళ్ళేవాళ్ళం. కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత, ఎవరి సహాయం లేకుండానే కొత్త ప్రదేశాలకు సులభంగా వెళ్ళగలుగుతున్నాం.
- మనం ఎక్కడ ఉన్నామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో గూగుల్ మ్యాప్స్ ద్వారా GPS (Global Positioning System) సాయంతో తెలుసుకోవచ్చు.
- The GPS unit was first used in 1973. అలఎగౌ అన్నిదు ఈ GPS సేవలను అందిస్తుంది. అయితే 1999లో మనకు, పాకిస్తాన్ ని మధ్య జరిగిన కార్గిల్ యద్ధంలో పాక్ సైనిక దళాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవటానికి ఇండియన్ ఆర్మీ కి నావిగేషన్ వ్యవస్థ అవసరమైంది.
- ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఏర్పడకూడదు అనే ఉద్ద్యేశ్యంతో మన దేశం కూడా సొంత నావిగేషన్ సిస్టం ని డెవలప్ చెయ్యాలని అనుకుంది.
- దానికి 2006 లో భారత ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో మన దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్ద అయిన ఇస్రో (ISRO) సొంత నావిగేషన్ సిస్టం ని డెవలప్ చేసే బాధ్యతను తీసుకుంది.
ఈ ప్రాజెక్ట్ కి Qualcomm కంపెనీ కూడా తన సహాయం అందించడానికి ముందుకు వచ్చింది.
- మొదట్లో ఈ ప్రాజెక్ట్‌కు IRNSS అంటే Indian Regional Navigation Satellite System అని పేరు. కానీ ఇప్పుడు దీనిని NavIC (నావిక్) అని మార్చారు, ఇది Navigation with Indian Constellation అని అర్థం.
- ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే, అమెరికా, రష్యా, చైనా, యూరోప్ తర్వాత స్వంత నావిగేషన్ సిస్టమ్ కలిగిన ఐదవ దేశంగా మన భారతదేశం నిలుస్తుంది.
- అయితే మన దేశంలో రూపొందుతున్న ఈ నావిక్ సిస్టం, అమెరికాకు చెందిన GPS కంటే మరింత మెరుగైనదిగా ఉండబోతుంది.
- ఎందుకంటే, అమెరికా GPS ప్రపంచం మొత్తాన్ని కవర్ చేయడానికి 24 ఉపగ్రహాలను ఉపయోగిస్తుంది, కానీ మన దేశం కేవలం భారత్‌కు మాత్రమే 7 ఉపగ్రహాలను వినియోగిస్తుంది. దీనివల్ల మన దేశానికి చెందిన నావిక్ సిస్టం మరింత ఖచ్చితంగా ఉంటుంది.
- భవిష్యత్తులో NavIC సేవలను మన దేశంతో పాటు ప్రపంచమంతటికీ అందించాలనే ఆలోచనలో భారతదేశం ఉంది.
0 Comments