What is Internet and How internet works:ఇంటర్నెట్ అంటే ఏమిటి?

 

  • సుమారు 30 ఏళ్ల క్రితం వరకు, ముఖ్యమైన సమాచారాన్ని పంపుతూ ఉత్తరాలు రాసేవారు. కానీ ఇప్పుడు, మేము ఈమెయిల్, వాట్సాప్, మెసెంజర్ వంటి సదుపాయాలను ఉపయోగిస్తున్నాము.
  • మనకు నచ్చిన సినిమాలను థియేటర్లకు వెళ్ళకుండానే, మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్లపై చూడగలుగుతున్నాము. 
  • గంటలు, రోజులు పట్టే పనులను ఇప్పుడు నిమిషాల్లోనే చేయగలుగుతున్నాము.
  • ఈ అన్ని మార్పులకు కారణం ఇంటర్నెట్. ఇంతకీ, ఇంటర్నెట్ అంటే ఏమిటి? దాని పని తీరు ఏమిటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
ఏ రకమైన సమాచారాన్నైనా - డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియోలు, ఆడియోలు వంటి రూపాల్లో - కంప్యూటర్లో నిక్షిప్తం చేయవచ్చు. మన చుట్టూ ఉన్న కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో నిరంతరం సమాచారం నిక్షిప్తం అవుతూ ఉంటుంది. ఈ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల World Wide Web లేదా www అనే సాంకేతిక వ్యవస్థలో భాగం కావచ్చు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్ల్డ్ వైడ్ వెబ్ WORLD WIDE WEB లోని సమాచారాన్ని పొందడానికి మనకు సహాయపడేది ఇంటర్నెట్ INTERNET. ప్రపంచం నుండి మనకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందేందుకు ఇంటర్నెట్ సహాయపడుతుంది.వ్యక్తిగత, సామాజిక, వ్యాపార, ప్రభుత్వ రంగాల వివిధ సంస్థలను ఒకదానితో మరొకటి సులభంగా అనుసంధానం చేయడానికి ఇంటర్నెట్ సహాయపడుతుంది.

INTERNET కు ఆ పేరు, INTERNETWORKING అన్న పదం నుండీ పెట్టబడింది.ఇంటర్నెట్‌వర్కింగ్ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు లేదా సిస్టమ్‌లు అంతర్గతంగా అనుసంధానం చెందడం.

ప్రపంచమంతాను ఒక్కటి చేయడానికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఉంది.

అయితే ఇంటర్నెట్ ఎలాంటి ప్రక్రియలో ప్రారంభమై, ఎప్పుడు ప్రారంభమైంది?

1960 మరియు 1980 మధ్య, యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ రహస్యంగా గూఢచారాన్ని సేకరించేందుకు ARPANET అనే వ్యవస్థను ఉపయోగించింది.

ఇది ఆప్టికల్ ఫైబర్, శాటిలైట్, మరియు వైర్లెస్ సాంకేతికతలతో పనిచేస్తుంది.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రక్షణ శాఖలు కలిసి పనిచేయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి ARPANETని ఉపయోగించేవారు.  1980లలో ARPANETని అంతర్జాతీయ వ్యాపార సంస్థలు కూడా ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం వినియోగించడం ప్రారంభించాయి.1990లకు వచ్చే సరికి, ARPANET వివిధ రంగాలకు విస్తరించి INTERNETగా మారింది.

Internet వల్ల ప్రపంచం సాంకేతికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఈమెయిల్EMAIL, ఇన్స్టంట్ మెసేజింగ్,MESSAGING వీడియో కాలింగ్video calling, ఆన్లైన్ షాపింగ్ online shoppingవంటి సేవలు ఇంటర్నెట్ ద్వారానే అందుబాటులోకి వచ్చాయి. మనం రోజుకు వాడే వివిధ రకాల యాప్స్, వెబ్సైట్లు, మనోరంజన పరికరాలు ఇంటర్నెట్ పైనే ఆధారపడి పనిచేస్తాయి. పాటలు వినడానికి, వీడియోలు చూడడానికి, వార్తలు చదవడానికి కూడా ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నాం. ఏ రకమైన సమాచారం కావాలంటే, ఏ రకమైన సేవలు అవసరమంటే ఇంటర్నెట్ ద్వారానే పొందుతున్నాం.

  • Facebook, Twitter, Instagram మరియు YouTube వంటి సామాజిక మాధ్యమ వేదికలు ప్రపంచానికి పరిచయమయ్యాయి.
  • ఈ సామాజిక మాధ్యమాల వల్ల ప్రభుత్వాల పనితీరు, పౌరుల సంక్షేమ కార్యక్రమాలు మరియు భద్రతా వ్యవస్థలు ఎంతో మెరుగుపడ్డాయి.
  • ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ వనరుల వల్ల విద్యార్థులు WIKIPEDIA వంటి సైట్ల నుండి ఉచితంగా అవసరమైన సమాచారాన్ని పొందుతున్నారు.
  • ఆన్లైన్ బ్యాంకింగ్, UPI వంటి సదుపాయాల వల్ల బ్యాంకింగ్ సేవలు, నగదు లావాదేవీలు చాలా సులభంగా మరియు సురక్షితంగా మారాయి.

Post a Comment

0 Comments