దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో లభిస్తున్న కిసాన్ వికాస్ పత్రం, సమర్థవంతమైన పెట్టుబడి ఎంపికగా చెబుతారు. ఈ ప్లాన్‌లో పెట్టుబడి చేస్తే ఏ రకమైన రిస్క్ లేదు. రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. అలాగే, ట్యాక్స్ మినహాయింపు కూడా ఇవ్వబడుతుంది.
ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లు చాలా ఉన్నాయి. అయితే, వాటిలో కొన్నింటిలో లాభాలతో పాటు రిస్క్ కూడా ఉంటుంది. కొందరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడవచ్చు. మరికొందరు రిస్క్ లేని పథకాల కోసం చూస్తూ ఉంటారు. రిస్క్ లేకుండానే రిటర్న్స్ ఎక్కువగా ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ పథకాలు చాలా ఉన్నాయి. అలాంటిదే పోస్టాఫీసులు అందించే కిసాన్ వికాస్ పత్ర పథకం. ఈ పథకం కింద పూర్తి 115 నెలల్లో పెట్టుబడి రెట్టింపు అవుతుందని
కిసాన్ వికాస్ పత్ర పధకంలో పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. పెట్టిన పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఈ పధకం క్రింద ఏడాదికి 7.5% వడ్డీ లభిస్తోంది. ఈ పధకంలో రూ.1000 నుండి మీ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఎలాంటి గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్నో ఖాతాలు తెరవవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర పథకం ప్రారంభించినప్పుడు దాని ఉద్దేశ్యం రైతులకు మాత్రమే సహాయపడటమే. కానీ కాలక్రమంలో అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పెద్దవారైనా, చిన్నవారైనా సింగిల్ లేదా జాయింట్ ఎక్కౌంట్‌గా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లలు కూడా 10 సంవత్సరాలు దాటితే తమ పేరుపై ఖాతా తెరవచ్చు, కానీ గార్డియన్ ఉండాలి. ఖాతా తెరవడం కోసం ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, KYC దరఖాస్తు అవసరం.
ఒకవేళ 115 నెలల ముగింపు కంటే ముందే మీరు విత్ డ్రా చేయాలనుకుంటే, అంటే ప్రీమెచ్యూరిటీ విత్ డ్రాయల్ కు కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. లాక్ ఇన్ పీరియడ్ ముగింపు తర్వాత 2 సంవత్సరాల 6 నెలలు పూర్తయిన తర్వాత మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే, ఖాతాదారుని మరణం, కోర్టు ఆదేశాలు లేదా ఆస్తుల అటాచ్మెంట్ వంటి పరిస్థితుల్లో కూడా మీరు విత్ డ్రా చేసుకోవచ్చు.
0 Comments