Laptop Useful Accessories :ల్యాప్‌టాప్‌ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ యాక్ససరీలు ఉంటే మీ పని మరింత సులభం.

 


మీరు ల్యాప్‌టాప్‌ ఎక్కువగా వాడుతున్నట్లయితే, ఈ యాక్ససరీలను ఉపయోగిస్తే మీ పని మరింత సులభంగా ఉంటుంది.

  • ల్యాప్‌టాప్‌లు చాలా మంది జీవితాలలో భాగమైపోయాయి. వర్క్‌ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ పని విధానం ప్రారంభమైన తర్వాత ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
  • ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల గంటల కొద్ది ల్యాప్‌టాప్‌లను ఉపయోగించవలసిన అవసరం ఏర్పడుతుంది. 
  • కానీ ల్యాప్‌టాప్‌తో పాటు కొన్ని యాక్ససరీలు ఉంటే పని మరింత సులభంగా ఉంటుంది. మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
  •  మీ అవసరాల కోసం ఈ యాక్ససరీలు ఉపయోగపడతాయి. ల్యాప్‌టాప్‌కు అత్యంత ముఖ్యమైన యాక్ససరీలు ఏవో ఒకసారి చూడండి.
Laptop Stand:

ఇంటి నుండి పని చేసే వారికి ఈ ల్యాప్‌టాప్ స్టాండ్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వారు సులభంగా కూర్చుని పని చేయడానికి ఈ స్టాండ్‌లు సహాయపడతాయి.

Ring light:

వీడియో కాల్‌లో మాట్లాడేటప్పుడు, గదిలో తగినన్ని వెలుతురు లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిప్పుడు, ఈ LED రింగ్ లైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే, లైట్ వెలుతురు నేరుగా మీ ముఖంపై పడి మంచిగా కనిపిస్తుంది. బ్లాగర్లకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Keyboard Cover:

ల్యాప్‌టాప్‌ కీబోర్డ్‌లోకి దుమ్ము లేదా నీరు వంటి లిక్విడ్‌లు చేరకుండా ఉండేందుకు కీబోర్డ్ కవర్స్ ఉపయోగపడతాయి. ఏదైనా లిక్విడ్ పడినా, ఈ కవర్స్ కీబోర్డ్‌ను డ్యామేజ్ నుండి రక్షిస్తాయి.

USB LED Desk Light:

రాత్రిళ్లు లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కీబోర్డుపై పనిచేయడం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కీస్ కనిపించవు. అందుకే, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోవచ్చునట్లుగా ఉండే ఈ USB కీబోర్డు లైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కనెక్ట్ చేసుకుంటే, చీకట్లో కూడా కీస్ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
Buy Online

Cooling Pad:
ఎక్కువగా గేమింగ్ చేసే ల్యాప్‌టాప్ వాడుకరులకు ఈ పరికరం ఉపయోగకరంగా ఉంటుంది. ల్యాప్‌టాప్ అధికంగా వేడెక్కకుండానే, దాని పర్ఫార్మెన్స్‌ను పెంచుతూ ఈ పరికరం సహాయపడుతుంది.

Webcam for Laptop:

మీరు ఎక్కువగా వీడియో కాల్స్‌లో పాల్గొంటే, క్వాలిటీతో కూడిన వెబ్ క్యామెరాను కొనుగోలు చేసుకోవచ్చు. సాధారణంగా, ల్యాప్‌టాప్‌లో ఉండే క్యామెరాలు ఎంతో స్పష్టతతో లేవు. మీ ల్యాప్‌టాప్‌కు సరిగ్గా క్యామెరా లేకపోతే, క్వాలిటీతో కూడిన వెబ్ క్యామెరాను కొనుగోలు చేసుకుని, USB ద్వారా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు.

Power Bank For Laptop:
పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ల్యాప్‌టాప్‌ను ట్రావెలింగ్‌లో వాడాలంటే పవర్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ చార్జింగ్ అయిపోతే, ఈ పవర్ బ్యాంక్ సహాయపడుతుంది. కాబట్టి, మీ ల్యాప్‌టాప్ చార్జింగ్ పిన్‌కు సరిపోయే పవర్ బ్యాంక్‌ను ఎంచుకోవాలి. అలాగే, కనీసం 10000mAh సామర్థ్యం ఉన్నది తీసుకోవాలి.

Post a Comment

0 Comments