https://www.treeofknowledge1.in/2024/04/drinking-pot-water-in-summer-benefits.html
.jpg)
మండే ఎండలో మట్టి కుండలో నీరు తాగితే ఏమోతుందో తెలుసా..?
ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా మారింది. రాత్రి కాస్తా చల్లని గాలి వీచినా, వేడి కారణంగా నిద్ర పట్టడం లేదు. వేడి కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం కోసం, కొందరు ఫ్రిజ్‌లో ఉన్న చల్లని నీటిని, మరికొందరు మట్టి కుండల్లోని నీటిని తాగుతున్నారు. మట్టి కుండల్లోని నీరు చల్లగా ఉండటంతో పాటు, ఆరోగ్యకరంగానూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కుండలు ఎక్కువగా కనిపిస్తాయి. మట్టి కుండల్లోని నీటిని తాగడం వల్ల ఏమాత్రం లాభాలు ఉన్నాయి.
కుండలోని నీరు సహజంగా చల్లబడుతుంది. అందువల్ల ఈ కుండలోని నీరు శరీరానికి ఎటువంటి హాని చేయదు. దగ్గు, జలుబు రావు. ఈ చల్లనీరు తృప్తిని కలిగిస్తుంది. వేసవిలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి దీన్ని తాగవచ్చు. అయితే, ఫ్రిడ్జ్‌లోని చల్లని నీరు తాగడం వల్ల దగ్గు, జలుబు వస్తాయి. దాహం తీరదు. శరీరం డీహైడ్రేట్ అవ్వడం జరుగుతుంది.
ఎండలో కాసేపు తిరిగినా, వేడి గాలుల వల్ల శరీరానికి హాని జరగవచ్చు. ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి, నిపుణులు కుండలోని చల్లని నీరు త్రాగమని సూచిస్తున్నారు. కుండలోని సహజమైన చల్లని నీరు, శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఎండలో బయటకు వెళ్ళేప్పుడు, చాలా మంది ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తీసుకెళ్తుంటారు. వీటికి బదులుగా, మట్టి బాటిళ్ళను వాడండి. ప్రస్తుతం వీటిని మార్కెట్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.
కుండలో నీరు ఎలా చల్లబడుతుందో చూద్దామంటే - కుండ గోడల్లో మన కంటికి కనిపించని చాలా చిన్న ఛిద్రాలు ఉంటాయి. ఈ ఛిద్రాల వల్ల నీరు బయటకు రాదు. కుండను తయారు చేసేటప్పుడు ఆ ఛిద్రాలు ఏర్పడతాయి. ఈ ఛిద్రాల వల్ల నీరు చెమట పట్టినట్లుగా కుండ నుండి వస్తుంటుంది. నీరు ఆవిరి కావాలంటే కొంత ఉష్ణోగ్రత అవసరం. ప్రతి గ్రాము నీరు ఆవిరి కావడానికి సుమారు 540 క్యాలరీల ఉష్ణం అవసరమవుతుంది. ఈ ఉష్ణంతో ఆవిరయ్యే నీరు కుండ గోడల నుండి బయటకు వెళ్తుంది. ఇలా కుండ గోడలు చల్లబడుతాయి. అందుకే కుండలో నీరు చల్లగా ఉంటుంది.
0 Comments