
మిరపను మన తెలుగు రైతులు "ఎర్ర బంగారం" అని ప్రేమగా పిలుస్తారు. ఈ పంటలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఆదాయం కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది.
నేల తయారి:
- మిరపకు ఎర్ర నేలలు మరియు నల్ల రేగడి నేలలు సక్రమంగా ఉంటాయి. పంట సాగు భూమిలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి, ముందుగా పచ్చి రోట్ట లేదా మినుము పంటను వేసి, దాన్ని భూమిలో కలిపి దున్నాలి.
- ఇలా చేయడం వల్ల భూమికి సహజ పోషకాలు లభిస్తాయి. 10-15 రోజుల తర్వాత, ట్రాక్టర్ కల్టివేటర్‌తో నేలను మెత్తగా దుక్కి, అయ్యేవరకు 2-3 సార్లు దున్నాలి.
నారు పెంచే విధానం:
- నారు పెంచడానికి, నేలను కొంచెం ఎత్తులో బెడ్లుగా సర్దుకోవాలి. నాలుగు మూలల్లోనూ సమానమైన ఎత్తు ఉండేలా చూసుకోవాలి.
- నారుమడిలో విత్తనాల మధ్య ఒక్క అంగుళం (ఒక్క ఇంచు) దూరంలో వేయాలి. నారు మొక్కలకు ఎక్కువ ఎండ తగలకుండా, సేల్టర్‌లో నారు వెయ్యని వారు నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటులా పైన వేయాలి.
- మొక్కల వయస్సు 35-40 రోజులు అయ్యాక, నేలలో నాటుకోవాలి.
మొక్కలను నాటుకునే విధానం:
- మొక్కలను నీటి అందించే నేలల్లో నాటుకోవడానికి, సాధారణంగా 24 x 24 ఇంచులు లేదా 26 x 26 ఇంచులు లేదా 28 x 28 ఇంచుల మధ్య దూరాన్ని ఎంచుకోవాలి.
- ఇది నేల స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. రెండు వైపులా అచ్చులుగా మొక్కలను నాటడం వల్ల, వాటి మధ్య సమాన దూరాలు ఉంటాయి.
- ఇది కూలీల అవసరాన్ని తగ్గిస్తుంది మరియు యంత్రాల వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ఇది మొక్కల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. మొక్కలను నాటే సమయంలో, వేర్వేరు చెడకుండా జాగ్రత్తగా నీటిని పోసి, నాటాలి.
- డ్రిప్ పద్ధతిలో నాటేప్పుడు, మొక్కల మధ్య 30-45 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలి.
కలుపు యాజమాన్యం:
- కలుపు మిరప పంట దిగుబడిని తగ్గించడంలో పెద్ద సమస్యగా ఉంది. కలుపు నివారణ కోసం, మొక్కలు నాటిన 20-25 రోజుల తర్వాత కలుపు గొర్రు లేదా గుంటుకలను ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి మొక్కలు నేలను మొత్తం కప్పివేయడానికి 4-5 సార్లు దున్నాలి.
- ఇలా చేయడం వల్ల మొక్క వేర్లు నేలలోకి విస్తరిస్తాయి మరియు మొక్కల ఎదుగుదల మెరుగుపడుతుంది. ఇక రెండు వైపులా సాల్లుగా మొక్కలు నాటినవారికి, మొక్కల మధ్య ఉన్న కలుపు కూడా తొలగిపోవడం వల్ల కలుపు కూలీల వినియోగం తక్కువగా ఉంటుంది.
- కలుపు నివారణ కోసం, మొక్కలను నాటే ముందు 1-2 రోజులలో పెండిమెథాలిన్ 1.5 మి.లీ./1 లీటర్‌తో కలిపి పిచికారి చేయాలి.
- పంటలో కలుపు మొక్కలు ఉంటే, మొక్కలు నాటిన 25 రోజుల తర్వాత క్విజాలోఫాస్ ఎథిల్ 400-500 మి.లీ./ఎకరం మొక్కలపై పడకుండా జాగ్రత్తగా పిచికారి చేయాలి.
- డ్రిప్ ద్వారా సాగు చేస్తే, ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగించడం వల్ల కలుపును నివారించవచ్చు.
పోషక యాజమాన్యం :
- మొక్కలను నాటిన 20-25 రోజులలో, ఎకరానికి 120 కిలో నత్రజని, 24 కిలో భాస్వరం మరియు 48 కిలో పోటాష్ ఇవ్వాలి.
- మొక్క పెరుగుదలను బట్టి నత్రజని ఎరువులను అందించాలి. పూత మరియు కాయ నాణ్యత కోసం, పోటాష్ను 2-3 సార్లు ఇవ్వాలి.
- వర్షాలు ఎక్కువగా పడుతున్నపుడు, మొక్కలు నేల నుండి పోషకాలను తీసుకోలేవు. కాబట్టి, 13:0:45 లేదా 19:19:19 ఎరువును 8 గ్రాములు లీటరు నీటిలో కలపి పైపాటుగా పిచికారి చేయాలి.
0 Comments