AI predicts a week in advance that a flood is coming.వరద రానున్నదని వారం ముందే అంచనా వేస్తుంది.

 


వరద రానున్నదని వారం ముందే అంచనా వేస్తుంది.

  • కృత్రిమ మేధస్సు (ఏఐ) రోజుకో కొత్త ఎత్తులను తాకుతోంది. తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు కంపెనీలు క్రొత్త పరిజ్ఞాన పరికరాలను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ విషయంలో, ఇటీవల గూగుల్ గొప్ప పురోగతిని సాధించింది.
  • కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రోజూ కొత్త ఎత్తులను తాకుతోంది.  కంపెనీలు క్రొత్త టూల్స్ తయారు చేసి తమ సత్తాను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 
  • ఈ విషయంలో, ఇటీవల గూగుల్ గొప్ప పురోగతిని సాధించింది. వరదలను ఖచ్చితంగా అంచనా వేయగల ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ టూల్ను అభివృద్ధి చేసింది. ఈ టూల్ భూమి యొక్క భౌతిక, వాతావరణ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఏడు రోజుల ముందే నదుల్లో వరదలు రాబోయే అవకాశాన్ని గుర్తించగలదు. 
  • మొదటిగా మన దేశంలోనే పరీక్షించినప్పటికీ, ఇప్పుడు 80 కిందటి దేశాలకు దీన్ని విస్తరించారు. దీని వల్ల 1800 కి పైగా ప్రాంతాల్లో వరదలను అంచనా వేయవచ్చు మరియు 46 కోట్ల మందికి ప్రయోజనకరంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. గూగుల్ సెర్చ్, మ్యాప్స్, ఆండ్రాయిడ్ అలర్ట్స్ వంటి గూగుల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వరదల గురించిన నోటిఫికేషన్లను వినియోగదారులకు అందిస్తుంది.
"ఇది ఎలా పనిచేస్తుంది?"
  • రెండు కీలక నమూనాల ద్వారా ఫ్లడ్ హబ్ వరదలను అంచనా వేస్తుంది. 
  •  మొదటిది హైడ్రోలాజికల్ మోడల్, ఇది భాష్పీకరణ, నదీ తీర పరిస్థితుల వంటి సమాచారాన్ని విశ్లేషించి, నీటి మట్టాలను అంచనా వేస్తుంది.  
  • రెండవది ఇనండేషన్ మోడల్, ఇది హైడ్రోలాజికల్ మోడల్ ద్వారా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి, ఉపగ్రహ చిత్రాల ఆధారంగా నీటి కదలికలను సిమ్యులేట్ చేసి ఆయా ప్రాంతాల్లో నరదలు వస్తాయేమో తెలియజేస్తుంది.

Post a Comment

0 Comments