What is Stock Dividend?
ఒక కంపెనీ సంపాదించిన లాభాలలో భాగాన్ని ఆ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న షేర్ హోల్డర్లకు పంచించే లాభ పంపిణీని డివిడెండ్ అంటారు.
సాధారణంగా, కంపెనీలు తమ డివిడెండ్లను సంవత్సరానికి ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి ప్రకటిస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి, అన్ని కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ డివిడెండ్ ప్రకటన చేస్తాయి - డివిడెండ్ ఇస్తున్నారా, లేదా ఎంత శాతం ఇస్తున్నారో వంటి వివరాలను ప్రకటిస్తాయి.
కంపెనీ సంపాదించిన లాభాలలో భాగాన్ని ఆ కంపెనీ షేర్లు కలిగి ఉన్న షేర్‌దారులకు పంచించే లాభాన్ని 'డివిడెండ్' అంటారు.
ప్రముఖ కంపెనీలు సంపాదించిన లాభాల్లో కొంత భాగాన్ని డివిడెండ్‌గా పంచుకుంటాయి. మిగిలిన లాభాలను వ్యాపార విస్తరణకు వినియోగిస్తాయి. అయితే, కొత్తగా ఏర్పడిన చిన్న సంస్థలు డివిడెండ్ ప్రకటించకుండా, మొత్తం లాభాలను వ్యాపార విస్తరణకు ఖర్చు చేస్తాయి.
అధిక డివిడెండ్‌ను ఇచ్చే కంపెనీలలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్ల షేర్ ధర మరింత పెరుగుతుంది. కాబట్టి, ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కంపెనీలు డివిడెండ్‌లను ప్రకటిస్తాయి. ఎంత శాతం డివిడెండ్ ఇవ్వాలో కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయిస్తారు.
డివిడెండ్లు డబ్బు లేదా షేర్ల రూపంలో ఇవ్వబడుతాయి. ఎక్కువగా డివిడెండ్లు డబ్బు రూపంలోనే ప్రకటించబడతాయి. ఒకవేళ కంపెనీలు డివిడెండ్‌ను ప్రకటిస్తే, ఆ డబ్బు నేరుగా మన బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
డివిడెండ్లు ఇచ్చే కంపెనీలలో పెట్టుబడి పెట్టడం వలన, షేర్ ధర పెరగడం వల్ల వచ్చే లాభాలతో పాటు, ఈ డివిడెండ్లను కూడా అదనంగా పొందవచ్చు.
Thank You
0 Comments