Sensex and Nifty.....?
- మనం ప్రతిరోజూ వార్తాపత్రికల్లోనూ, టీవీ వార్తల్లోనూ సెన్సెక్స్ ఎన్ని పాయింట్లు లాభపడింది లేదా నిఫ్టీ ఎన్ని పాయింట్లు నష్టపోయింది అనే వార్తలను చదువుతూనే ఉంటాము. అయితే సెన్సెక్స్ మరియు నిఫ్టీ అనేవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం . ముందు వీటి గురించి అర్ధం అవ్వాలంటే ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకోవాలి .
ఇండెక్స్ (Index) అంటే ఏమిటి ?
.jpg)
- స్టాక్ మార్కెట్‌ల ప్రవర్తనను సూచించే సూచికగా ఇండెక్స్ పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా అనేది ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది.
- మరింత సులభంగా చెప్పాలంటే, మనం అన్నం ఉడికిందా లేదా అనేది గిన్నెలో నాలుగు మెతుకులు వేసి చూస్తే తెలిసిపోతుంది.
- అంతే గాని ప్రతి మెతుకుని తీసి పరీక్షించడం అనేది కుదరదు .. అలాగే స్టాక్ మార్కెట్ లోనూ జరుగుతుంది .
- మన దేశంలోని బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)లో 5000 కంటే ఎక్కువ కంపెనీలు లిస్ట్ చేయబడ్డాయి. అలాగే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE)లో సుమారు 2000 కంపెనీలు లిస్ట్ చేయబడ్డాయి.
- ఇప్పుడు అసలు ఏ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉందొ చూడాలనుకుంటే ఇన్ని వేల కంపెనీలను పరీక్షింది బేరీజు వెయ్యడం చాల కష్టం .
- అందుకే ఇన్ని కంపెనీలను కాకుండా ప్రతి ఇండస్ట్రీ పరంగా ఏ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజషన్ అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి కొన్ని కంపెనీలను తీసుకుని ఆ కంపెనీల షేర్ల కదలికను బట్టి మొత్తం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ని అంచనా వేస్తారు
ఇటువంటివి మన దేశంలో ముఖ్యంగా రెండు సూచీలు ఉన్నాయి . ఒకటి సెన్సెక్స్ ,రెండు నిఫ్టీ. ముందుగా సెన్సెక్స్ అంటే ఏంటో చూద్దాం.
(Sensex) సెన్సెక్స్:
.jpg)
- (Sensex) సెన్సెక్స్ అనే అనే పదం Sensitive Index అనే దాని నుండి వచ్చింది సెన్సెక్స్ ని S&P BSE SENSEX లేదా S&P SENSEXఅని కూడా పిలుస్తారు . సెన్సెక్స్ అనేది భారతీయ స్టాక్ మార్కెట్లు ఒక రోజు లేదా నిర్దిష్ట వ్యవధిలో లాభపడ్డాయా లేదా నష్టపోయాయా అనే విషయాన్ని సూచించే సూచిక.
- (Bombay Stock Exchange) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతున్న కొన్ని వేల కంపెనీలలో ...ఒక కంపెనీ చరిత్ర ,అలాగే ఏ కంపెనీ మార్కెట్ కాపిటల్ ఎక్కువగా ఉందొ , మరియు ఏ కంపెనీ పనితీరు బాగుందో చూసి వాటిలో మొదటి కొన్ని కంపెనీలను తీసుకుంటారు ..
సెన్సెక్స్ ని ప్రభావితం చేసే కొన్ని కంపెనీలు ఇవే :
Adani Ports
Asian Paint
Axis Bank
Bajaj-Auto
Bharti Airtel
Cipla
Coal India
Dr. Reddys Laboratories
HDFC
HDFC Bank
Hero MotoCorp
Hindustan Unilever
ICICI Bank
Infosys
ITC
Kotak Mahindra Bank
L&T
Lupin Limited
Mahindra & Mahindra
Maruti Suzuki
NTPC
PowerGrid Corporation of India
Reliance Industries
SBIN
Sun Pharma
Tata Motors
Tata Steel
TCS
Wipro
(ఈ లిస్ట్ లో ఇవే కంపెనీ లు ఉండాలని ఏమి లేదు. ఈ లిస్ట్ లో కంపెనీ లు మారుతూ ఉండవచ్చు)
- ఫలానా రోజులో ఈ కంపెనీ లో ఎక్కువ కంపని లాభాల్లో ఉంటె ఆ రోజు సెన్సెక్స్ కూడా పెరుగుతుంది ఒకవేళ ఈ కంపెనీలలో ఎక్కువ కంపెనీలు నష్టపోతే ఆ రోజు సెన్సెక్స్ కొన్ని పాయింట్లు నష్టపోవడం జరుగుతుంది .. 1979 లో సెన్సెక్స్ base value ని 100 పాయింట్లుగా తీసుకున్నారు .. కానీ ఇప్పుడు సెన్సెక్స్ 36500 వరకు చేరుకుంది .. అంటే మార్కెట్లు ఏవిదంగా పెరిగాయో అర్ధం అర్ధం చేసుకోవచ్చు
నిఫ్టీ (Nifty):

- 'నిఫ్టీ' అనే పదం 'నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫిఫ్టీ' అనే పదం నుండి ఉద్భవించింది, ఇది నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో జాబితా చేయబడిన టాప్ 50 కంపెనీలతో కూడిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను సూచిస్తుంది.
- ఈ నిఫ్టీ ని . NIFTY 50 అని CNX NIFTY అని కూడా పిలుస్తారు Nifty అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతున్న కంపెనీలలో టాప్ కంపెనీలను తీసుకుని వాటి షేర్ల ధర కదలిక ఆధారంగా ఈ నిఫ్టీ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది ..అయితే ఎప్పుడు ఈ కంపెనీలు మాత్రమే ఆ లిస్ట్ లో ఉంటాయని ఏమి లేదు .. కొన్ని కంపెనీ లు ఈ లిస్ట్ నుండి తీసివేయబడతాయి అలాగే కొన్ని కంపెనీ పేర్లు చేర్చబడతాయి.
Sensex గురించి తెలుసుకోవడానికి >> www.bseindia.com
Nifty గురించి తెలుసుకోవడానికి >> www.nseindia.com
0 Comments