మ్యూచువల్ ఫండ్ అంటే ఒకే ఆర్థిక లక్ష్యం కలిగిన పెట్టుబడిదారుల నుండి డబ్బుని సేకరించడానికి ఏర్పాటైన ట్రస్ట్. ఇక్కడ పెట్టుబడిదారులందరి లక్ష్యం పెట్టుబడిగా డబ్బుని పెట్టి, దాని నుండి లాభాలు సంపాదించడం. ఈ లక్ష్యంతో పెట్టుబడిదారులందరి నుండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ డబ్బుని సేకరిస్తుంది. ఈ మొత్తాన్ని మార్కెట్లలో నైపుణ్యం ఉన్న ఫండ్ మేనేజర్లు వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి చేస్తారు. ఆ పెట్టుబడుల నుండి వచ్చే లాభాలను, ఫండ్లో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి వారి పెట్టుబడి ఆధారంగా విడిచిపెడతారు.
మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) అనేవి సామాన్య పౌరులకు అనుకూలమైన పెట్టుబడి ఆప్షన్లు. ఎందుకంటే, కొంతమంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు కానీ దాని గురించి సరిగ్గా తెలుసుకోలేరు. మరికొందరు స్టాక్ మార్కెట్ను పరిశీలించే సమయం లేదు లేదా ఎక్కువ రిస్క్ తీసుకోలేరు. అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు. ఇలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి:
భద్రత: మ్యూచువల్ ఫండ్స్‌ను పెద్ద బ్యాంకులు మరియు ట్రస్టులు నిర్వహిస్తాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా SEBIకి లోబడి దాని నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. SEBI వీటిని పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్‌లో భద్రంగా పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు పెట్టుబడిదారుడిగా, మీ డబ్బు ఎక్కడ పెట్టుబడిగా ఉందో, ప్రస్తుతం దాని విలువ ఎంతఉందో వంటి వివరాలను పారదర్శకంగా మీకు తెలియజేయబడుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో మీ డబ్బును ఎప్పుడైనా సులభంగా తిరిగి తీసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసిన రెండు లేదా మూడు రోజుల్లో, మీ డబ్బు మీ బ్యాంకు ఖాతాలోకి చేరుతుంది.
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి ఒకేసారి భారీ మొత్తం అవసరం లేదు. మీరు ప్రతి నెలా మీ సామర్థ్యానికి తగినంత చిన్న మొత్తాలు పొదుపుగా పెట్టవచ్చు. ఇలా చిన్న చిన్న పొదుపులు చేస్తూ వడ్డీ సూత్రాన్ని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో మీ ఆస్తి పెరుగుతుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో వివిధ రకాల ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి ఈ క్రింది రెండు:
1. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ (ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్) :-
ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఈ ఫండ్‌లో నుండి బయటకు రావచ్చు లేదా కొత్త పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఈ ఫండ్‌లోకి ప్రవేశించవచ్చు. ఈ ఫండ్స్‌కు నిర్దిష్టమైన సమయం లేదా లాక్-ఇన్ పీరియడ్ ఉండదు.
2. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్ (క్లోజ్డ్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్):-
మనం క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, ఆ ఫండ్స్‌కు ఒక నిర్దిష్టమైన లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ముగియేవరకు మన పెట్టుబడిని ఆ ఫండ్స్‌లోనే కొనసాగించాల్సి ఉంటుంది. అందుకే మనకు కావాలంటే ఎప్పుడైనా మన పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదు.
Thank You
0 Comments