What is Inflation in Telugu..?

 What is Inflation in Telugu.....?

Inflation:

  • ద్రవ్యోల్బణం అనే పదాన్ని మనం తరచుగా టీవీలలో, వార్తాపత్రికలలో చూస్తుంటాం. ద్రవ్యోల్బణం అంటే ఏమిటి? దీని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉంటుంది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
  • ద్రవ్యోల్బణం అంటే రోజువారీ వాడే వస్తువుల లేదా సేవల ధరలు పెరగే రేటు. ఈ ధరలు సాధారణంగా శాతంగా వ్యక్తం చేస్తారు. డిమాండ్ పెరగడం, సప్లై తగ్గడం వల్ల ధరలు పెరుగుతాయి. ఇదే ద్రవ్యోల్బణానికి కారణం. 
  • ఉదాహరణకు, ఒకప్పుడు 10 రూపాయలు ఉండే వస్తువు ఇప్పుడు 100 రూపాయలు అయ్యింది. ఇలా ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం కారణం. ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణం 5.69%గా ఉంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో సగటున ధరలు 5.69% పెరిగాయి.
  • కొన్నిసార్లు ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. 2008లో జింబాబ్వేలో అన్ని ధరలు 24 గంటలకు ఒకసారి డబుల్ అయ్యాయి. ధరలు ఎంత పెరిగినా, ప్రభుత్వం కరెన్సీ ప్రింట్ చేసింది. అంతేకాక, పేపర్ కూడా తగ్గిపోయింది. 
  • ఆ సంవత్సరంలో జింబాబ్వేలో ద్రవ్యోల్బణం 1,12,00,000% పెరిగింది! ఇది ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని స్థితికి దిగజార్చింది. 
  • కానీ ద్రవ్యోల్బణం ఎల్లప్పుడూ చెడ్డది కాదు. కొంత మేర పెరగడం ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహాయపడుతుంది. అయితే, పరిమితి మించితే ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని సరైన స్థాయిలో నియంత్రించడం అవసరం.
  • ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరగడాన్ని inflation, ధరలు తగ్గడాన్ని deflation అంటారు. ప్రతి సంవత్సరం deflation పెరిగితే, వస్తువుల కొనుగోలు తగ్గుతాయి. దీనివల్ల కంపెనీలకు నష్టం, ఉద్యోగులకు ఉద్యోగనష్టం జరుగుతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.
  • మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే సరైన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అవసరం.

Post a Comment

0 Comments