What Is GDP(Gross Domestic Product) in Telugu, Brief about GDP

 What is GDP(Gross Domestic Product)


What is GDP?

మనం టీవీలో లేదా పత్రికలో GDP పెరిగింది, తగ్గింది అనే వార్తలు తరుచూ వినతాం. కానీ GDP అంటే ఏమిటో మనలో చాలా మందికి తెలియదు. కాబట్టి GDP అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఎందుకు అది అంత ముఖ్యమైనది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జీడీపీ అంటే Gross Domestic Product. ఇది తెలుగులో 'స్థూల దేశీయోత్పత్తి' అని పిలుస్తారు. అంటే, ఒక సంవత్సరంలో ఒక దేశంలో అమ్మిన అన్ని అంతిమ ఉత్పత్తులు మరియు సేవల మొత్తం విలువను సూచిస్తుంది.

ఉదాహరణకు, ఒక సూపర్ మార్కెట్ ఉన్నట్లు అనుకోండి. ఒక రోజు దానికి 20 రూపాయల విలువ ఉన్న సబ్బు, 10 రూపాయల విలువ ఉన్న చాకొలేట్, 50 రూపాయల విలువ ఉన్న పుస్తకం అమ్మినట్లు అనుకోండి. అప్పుడు ఆ రోజు దాని జీడీపీ 80 రూపాయలను సాధించినట్లు ఉంటుంది. ఇలాగే, ఒక దేశంలో ఉత్పత్తి చేసి అమ్మిన అన్ని వస్తువుల మొత్తం విలువను కలపడం వల్ల ఆ దేశం యొక్క జీడీపీని లెక్కించవచ్చు.

అయితే, అన్ని ఉత్పత్తులు ఈ GDPలో చేరవు. ఉదాహరణకు, జపాన్‌కు చెందిన ఏదైనా కంపెనీ మన భారతదేశంలో ఏదైనా యంత్రాన్ని అమ్మితే, ఆదాయం మన జాతీయ ఆదాయంలో చేరదు. అది జపాన్ జాతీయ ఆదాయంలో కలుస్తుంది.

జీడీపీలో మధ్యవర్తి ఉత్పత్తులను లెక్కించకూడదు. కేవలం అంతిమ ఉత్పత్తుల విలువనే మాత్రమే లెక్కించాలి. ఉదాహరణకు, కారులో వాడే టైర్, సీట్ వంటివి మధ్యవర్తి ఉత్పత్తులు. కారు అంతిమ ఉత్పత్తి. కాబట్టి జీడీపీలో కేవలం కారు విలువనే లెక్కిస్తారు. 

మరో ఉదాహరణగా, కాఫీ పొడి మధ్యవర్తి ఉత్పత్తి. కాఫీ అంతిమ ఉత్పత్తి. కాబట్టి జీడీపీలో కేవలం కాఫీ విలువనే లెక్కిస్తారు.

జీడీపీ పడిపోవడం అంటే, మన దేశంలో తయారైన ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోయాయని అర్థం. అలాగే, పక్క దేశాల నుండి ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తున్నామని అర్థం. దీనివల్ల మన దేశ ఉత్పత్తుల డిమాండ్ తగ్గుతుంది. దీంతో ఉత్పత్తి, ఉద్యోగాలు తగ్గిపోతాయి. 

కాబట్టి, జీడీపీ పెరగాలంటే మనం మన దేశ ఉత్పత్తులను ఎక్కువగా కొనాలి. అప్పుడే ఉత్పత్తి, ఉద్యోగాలు పెరుగుతాయి. జీడీపీ పెరగడం వల్ల ఒక దేశం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.

Post a Comment

0 Comments