Undersea hunt for this metal needed to make batteries for electric vehicles
భారత్ సముద్ర గర్భంలో ఉన్న ఖనిజ వనరుల అన్వేషణపై దృష్టి సారించింది.
పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగించే విధంగా ఈ ఖనిజాలను వెలికి తీస్తున్నామన్నది భారత్ యొక్క ప్రస్తుత పరిస్థితి.
హిందూ మహాసముద్రంలో అన్వేషణ చేపట్టడానికి, భారత్‌కు ఇప్పటికే రెండు డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సులు ఉన్నాయి.
సముద్ర ఖనిజాలు అత్యంత కీలకంగా ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా బలమైన దేశాలు ఈ వనరుల కోసం పోటీ పడుతున్న ఈ సమయంలో, భారత్ కూడా ఈ పోటీలో చేరింది.
సముద్రంలో వేలాది మీటర్ల లోతుల్లో కోబాల్ట్, నికెల్, కాపర్, మాంగనీస్ వంటి భారీ ప్రమాణంలో ఉన్న ఖనిజాలను సేకరించడానికి చైనా, రష్యా తో పాటు భారత్ కూడా పోటీపడుతోంది.
వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు సౌర, వాయు విద్యుత్, వైద్యుతిక వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీ వంటి ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ ఖనిజాల పాత్ర చాలా కీలకంగా ఉంది.
సముద్రాల్లో ఖనిజాల వెలికితీతకు సంబంధించి ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ (ఐఎస్ఏ) 31 ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్సులను ఇచ్చింది. వీటిలో 30 లైసెన్సులు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నాయి.
ఈ వారంలో మైనింగ్ లైసెన్సు విధానాల పై చర్చించేందుకు, ఈ అంశానికి సంబంధించిన సభ్య దేశాలు జమైకాలో సమావేశమవుతున్నాయి.
ఐఎస్ఏ భారత్ కొత్తగా చేసిన దరఖాస్తులను ఆమోదిస్తే, సముద్ర ఖనిజాల అన్వేషణకు ఉన్న భారత్ లైసెన్సుల సంఖ్య రష్యాతో సమానంగా ఉంటుంది, చైనా కంటే ఒకటి తక్కువగా మాత్రమే ఉంటుంది.
హిందూ మహాసముద్రం మధ్యభాగంలోని హైడ్రోథర్మల్ వెంట్స్ సమీపంలో కాపర్, జింక్, బంగారం, వెండి మొదలైన ఖనిజ నిల్వలు ఉన్న చిమ్నీ రకం దిబ్బలను, పాలిమెటాలిక్ సల్ఫైడ్స్‌ను తవ్వించేందుకు భారత్ తన దరఖాస్తులో అనుమతి కోరింది.
ఇందుకు సంబంధించి ఐఎస్ఏ న్యాయ, సాంకేతిక కమిషన్ కొన్ని ప్రశ్నలు, వ్యాఖ్యలతో కూడిన జాబితాను భారత ప్రభుత్వానికి పంపినట్లు బీబీసీ పరిశీలించిన ఓ డాక్యుమెంట్ వెల్లడించింది.
అలాగే, సెంట్రల్ ఇండియన్ ఓషన్‌లోని అఫాన్సీ నికిటిన్ సమీపం ఉన్న కోబాల్ట్, ఫెర్రోమాంగనీస్ నిల్వలను వెలికితీసేందుకు భారత్ మరో దరఖాస్తు చేసింది.
అయితే, ఈ ప్రాంతాన్ని ఇప్పటికే ఓ దేశం కోరుకుందని, దీనిపై భారత్ ప్రతిస్పందనను కూడా అడిగినట్లుగా ఐఎస్ఏ గుర్తించింది.
ఈ దరఖాస్తులకు ఆమోదం లభిస్తుందా లేదా అనేది పక్కన పెట్టితే, సముద్రపు అడుగున ఉన్న కీలకమైన ఖనిజాల వెలికితీత పోటీలో వెనకపడకూడదని భారత్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
0 Comments