కాకర సాగు విధానం ( KAKARA SAGU VIDHANAM )
నేల తయారి
కాకరకాయ పంటకు ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, లేత నీటిపారుదలు ఉన్న నేలలు అనువైనవి. విత్తనాలు వేయడానికి ముందు, PH విలువ 5.5-6.4 ఉన్న నేలను 2-3 సార్లు ప్లౌ చేసి మంచిగా దున్నవలసి ఉంటుంది. చివరి దుక్కికి ముందు, 8-10 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 50 కిలోల DAP, 25 కిలోల పోటాష్ కలిపి వేసి, చివరి దుక్కి చేయాలి.
పందిరి విధానాలు
మన తెలుగు రైతులు అధికంగా తాత్కాలిక పందిరులను మరియు శాశ్వత పందిరులను ఎక్కువగా వాడుతున్నారు. తాత్కాలిక పందిరులను పంట మార్పిడి సమయంలో తొలగిస్తారు మరియు మళ్లీ ఏర్పాటు చేసుకుంటారు. శాశ్వత పందిరులను ఏర్పాటు చేసుకుంటే, ఒకే ఖర్చుతో శాశ్వతంగా పంటలను వేసుకోవచ్చు. ఇది డ్రిప్ ఇరిగేషన్‌గా పనిచేస్తుంది.
విత్తనం విత్తుకునే విధానం
ఒక ఎకరం పొలంలో హైబ్రిడ్ విత్తనాలు వేస్తే 500-600 గ్రాములు, సూటిరకం (దేశీ రకం) విత్తనాలు వేస్తే 800-1000 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తుకునేప్పుడు సాలుల మధ్య దూరం 2 మీటర్లు, మొక్కల మధ్య దూరం 50 సెంటీమీటర్లుగా ఉంచాలి.
- విత్తనాన్ని నాటి 4 నుండి 6 రోజుల మధ్య విత్తనం మొలకడం ప్రారంభమవుతుంది.
- 40 నుండి 45 రోజుల మధ్య పూలు వికసిస్తాయి.
- 55 నుండి 60 రోజుల మధ్య మొదటి కోత ప్రారంభమవుతుంది.
పంట వయస్సు 20-25 రోజులలో బోరాన్ 2 గ్రాములను ఒక్క లీటర్ నీటిలో కలిపి, పూత దశలో పిచికారి చేయాలి. ఇలా పూత దశలో బోరాన్ పిచికారి చేయడం వలన మగ పుష్పాల వృద్ధిని తగ్గించి, ఆడ పుష్పాలను పెంపకానికి సహాయపడుతుంది.
నీటి యాజమాన్యం
తీగ మొక్కల సాగులో, డ్రిప్ మరియు మల్చింగ్ కవర్ సాగు పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. ప్రతి రోజు ఒక్క గంట పాటు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే సరిపోతుంది. భూమి యొక్క స్వభావాన్ని బట్టి, నేల పూర్తిగా ఎండిపోకుండా ఉండేలా, రైతులు నీటి పారుదల ద్వారా నీటిని అందించాలి.
తెగుళ్ళు మరియు చిడపిడల నివారణ
పండు ఈగ
పండు కాయలను ఆశించే ఈగలను నివారించేందుకు, పంట చేనునుండి కాయలను తీసివేసి, ఒక్క గుంతలో వేసి మట్టితో కప్పివేయాలి. ఈగల నివారణ కోసం, 2 మీ.లీ మాలాథియాన్‌ను ఒక్క లీటర్ నీటిలో కలపి పంటను పిచికారి చేయాలి.
బూడిద తెగులు
చలికాలంలో లేదా వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ బూడిద తెగులు ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణ కోసం, డైనోకప్ 5 మి.లీ. లేదా మైక్లోబ్యుటానిల్ 0.5 గ్రాములు లేదా హెక్సాకోనాజోల్ 1 గ్రామును ఒక లీటరు నీటిలో కలపడం ద్వారా పిచ్చికారి తయారు చేసుకోవాలి.
మచ్చ తెగులు
ఈ మచ్చ తెగులు ఆకుల మీద చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, క్రమంగా పెరిగి ఆకుల మొత్తాన్ని కప్పిపుచ్చుకుంటాయి. దీనివల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, మంకొజేబ్ 3 గ్రాములు లేదా కార్బెండాజిమ్ 2 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములను ఒక లీటరు నీటిలో కలపాలి మరియు పిచ్చికారి చేయాలి.
0 Comments