How to Create a Website: Step-by-Step Guide in Telugu
How to Start a Website: Step by Step Guide:
ఆన్ లైన్ ద్వారా మనీ సంపాదించే మార్గాలలో Blogging (Blog లేదా Website లో ఆర్టికల్స్ వ్రాయడం) అనేది మొదటి స్థానంలో ఉంటుంది. వ్రాయడం అనేది మీకు హాబీ అయితే ఏ విషయం గురించి అయినా మీరు ఆసక్తికరంగా వ్రాయగలిగితే మీరు website ద్వారా మనీ సంపాదించవచ్చు. ఇప్పటికే మన దేశంలో ఈ Blogging ద్వారా లక్షలు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇలా website ని మొదలుపెట్టి ఆర్టికల్స్ రాస్తూ సంపాదించాలి అనుకుంటున్నారా? website క్రియేట్ చెయ్యడం కోసం మీకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. మీకు మీరే website ని సులువుగా క్రియేట్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు step by step వివరంగా తెలుసుకుందాం.
Online లో లక్షలు సంపాదిస్తున్న Bloggers
Topic ని ఎంచుకోవడం:

ముందుగా మీరు ఏ టాపిక్ మీద website ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇది అన్నిటికన్నా చాలా ముఖ్యమైన అంశం. మీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉండి, మంచి నాలెడ్జ్ ఉంటుందో ఆ టాపిక్ నే ఎంచుకోండి. ఎందుకంటే చాలామంది వాళ్లకు ఇంటరెస్ట్ లేని టాపిక్ మీద website ని స్టార్ట్ చేస్తారు. కొంతకాలం వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత వాళ్లకు బోర్ కొడుతోంది. ఎందుకంటే వాళ్ళకి ఆ టాపిక్ ఇంటరెస్ట్ లేదు కాబట్టి. దాంతో కొత్త కొత్త ఆర్టికల్స్ రాయలేక.మధ్యలోనే ఆ website ని వదిలేస్తారు. అన్ని రోజులు పడ్డ కష్టం, డబ్బు వృధా. కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా గాని మీకు ఏ టాపిక్ నచ్చుతుందో ఆలోచించి ఎంచుకొండి. అది టెక్నాలజీ ,హెల్త్, ప్యాషన్, సినిమాలు, వంటలు ఇలా ఏ టాపిక్ అయినా కావచ్చు.
Domain Name కొనడం:
Domain Name అంటే సింపుల్ గా మీ website కి అడ్రస్ అని చెప్పొచ్చు. ఉదాహారానికి మన తెలుగుబడి website కి Domain Name www.https://treeofknowledge1.blogspot.com/ మీరు గూగుల్ లో ఈ Domain Name ని సెర్చ్ చేస్తే మన తెలుగుబడి website ఓపెన్ అవుతుంది. అలాగే మీరు పెట్టబోయే website కి కూడా ఒక డొమైన్ ని ఎంచుకోండి.
Domain Name ఎంచుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని సూచనలు:
1. మీ Domain Name మీరు ఎంచుకున్న టాపిక్ కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. ఉదాహరణకి మీరు సినిమాలకు సంబందించిన website ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఆ డొమైన్ లో Movies, Cinema, Film వంటి పదాలు ఉండేలా చూసుకోండి. దాంతో జనాలకి మీ డొమైన్ చూసిన వెంటనే అది సినిమాలకు సంబందించిన website అని సులువుగా అర్ధమవుతుంది.
2. Domain Name చిన్నగా ఉండేలా చూసుకోండి. మీరు ఎంచుకునే డొమైన్ సాధ్యమైనంత చిన్నగా అలాగే జనాలకి సులువుగా గుర్తుండేలా చూసుకోండి. ఉదాహారానికి www. bestmovienewsfortelugupeople.com అనే డొమైన్ కన్నా www.movienews.com అనే Domain సులువుగా గుర్తుంటుంది.
3. Domain Name చివర .com అని ఉండేలా చూసుకోండి. కానీ చాల వరకు .com తో ఉనట్టువంటి డొమైన్ లు అమ్ముడయ్యిపోయాయి. ఒకవేళ మీరు అనుకున్న Domain Name చివర .com లేనట్లయితే ఏమి పరవాలేదు .net గాని .in గాని .org ఉన్న పరవాలేదు.
ఇప్పడు మీరు అనుకున్న Domain Name ఆన్లైన్ లో మనకి అందుబాటులో ఉందా లేక ఇంతకు ముందే ఎవరైనా ఆ పేరుని కొనుక్కున్నారా అనేది చెక్ చేసుకుని ఆ డొమైన్ ని కొనుక్కోవాలి. మీరు Domain Name కొనుక్కోవాలి అనుకుంటే Godaddy వెబ్సైటు లో రిజిస్టర్ అయ్యి డొమైన్ కొనుక్కోండి. ఎందుకంటే అన్నిటికన్నా ఈ Godaddy వెబ్సైట్ లో డొమైన్ తక్కువ ధరకు లభిస్తాయి.
మీరు డొమైన్ కొనాలనుకుంటున్నారా? >> Go to Godaddy
Platform ని ఎంచుకోవడం:
మీరు website ని స్టార్ట్ చెయ్యాలనుకుంటే ముఖ్యంగా రెండు Platformలు ఉన్నాయి. 1.Blogger 2.Wordpress. వీటి గురించి వివరంగా చూద్దాం
Blogger:

బ్లాగర్ అనేది గూగుల్ కి సంబందించిన Platform. ఈ బ్లాగర్ లో మీరు Free గా website ని create చేసుకోవచ్చు. కానీ బ్లాగర్ ద్వారా create చేసిన website చూడడానికి అంతగా బాగుండదు. అలాగే దీనిలో ఫీచర్స్ కూడా తక్కువగా ఉంటాయి.
Wordpress:

ఇంటర్నెట్ లో ఉన్న దాదాపు 90% పైగా వెబ్సైటు లు ఈ Wordpress ద్వారా create చేసినవే. దీనిలో మీరు మీకు కావాల్సినట్టుగా website ని తయారుచేసుకోవచ్చు. Wordpress ద్వారా create అయిన website చూడడానికి చాల ప్రొఫెషనల్ గా ఉంటుంది . Wordpress లో మీరు ఎంచుకున్న టాపిక్ కి తగ్గట్టుగా Themes అనేవి ఉంటాయి. మీకు కావాల్సిన Themes, Plugins ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ కాలం పాటు website ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే wordpress అనేది మీకు బెస్ట్ ఛాయిస్. నేను అయితే Wordpress ద్వారానే website స్టార్ట్ చెయ్యమని సలహా ఇస్తాను.
Hosting ఎంచుకోవడం:
మీరు Wordpress ద్వారా website ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు హోస్టింగ్ తీసుకోవాలి.Hosting అంటే ఏమిటో చూద్దాం.
Hosting అంటే... మీరు websiteలో ఏదైనా ఒక ఆర్టికల్ రాసారంటే మీరు ఒక ఫైల్ create చేసినట్టు. అంటే మీరు Wordpress ద్వారా కొన్ని ఫైల్స్ ని create చేస్తారు. ఇటువంటి files అన్నిటిని సర్వర్ లలో స్టోర్ చేసి ఇంటర్నెట్ లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్లకు మీ website కనపడేలా చేసేదీ ఈ Hosting. ఈ Hosting అనేది లేకపోతే ఇంటర్నెట్ లో మీ website అనేది కనపడదు.

కాబట్టి మీరు మీ website కోసం ఒక Hosting ని కొనవలసి ఉంటుంది. హోస్టింగ్ అందిస్తున్న వాటిలో BlueHost మరియు Hostgator అనేవి మంచి కంపెనీలు. ఈ హోస్టింగ్ కోసం ఒక సంవత్సరానికి దాదాపు 3000 రూపాయలకు వరకు చెల్లించవలసి ఉంటుంది. అయితే BlueHost వాళ్ళు ఒక్కొక్క సమయంలో 50% ఆఫర్ పెడతారు. ఆ సమయంలో మీరు కొనుక్కుంటే ఇంకా తక్కువ ధరకే మీకు హోస్టింగ్ లభిస్తుంది. కాబట్టి BlueHost లో రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన ప్లాన్ ని ఎంచుకుని Hosting కొనుక్కోండి.
BlueHost లో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి : BlueHost
వెబ్ సైట్ setup చెయ్యడం:
మీరు Hosting ప్లాన్ కొనుక్కున్న తరువాత మీ Godaddy కొనుక్కున్న డొమైన్ ని, Wordpress ని, మీరు తీసుకున్న Hostingని ఈ మూడింటిని కనెక్ట్ చెయ్యవలసి ఉంటుంది. ఇది పెద్ద కష్టమైనపనేమీ కాదు. ఇవి ఎలా కనెక్ట్ చెయ్యాలో ఇక్కడ వివరించం కుదరదు. దీనికి సంబందించి యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి. వాటిని చూస్తూ step by step ఫాలో అవుతూ Domain, Wordpress, Hosting ఈ మూడింటిని కనెక్ట్ చేసుకోండి.
ఇక్కడితో మీ website రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీ వెబ్సైటు ని wordpress లో మీకు కావాల్సినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంతా రెడీ అయిన తరువాత ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టండి.
మీకు ఏవైనా సందేహాలు ఉంటె క్రింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియచెయ్యండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో ఈ పోస్ట్ ని షేర్ చెయ్యండి.
0 Comments