ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, నీటి ఆవి ఆకాశంలోకి ఎదురుగా ఎగిరి 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. అయితే, పై నుంచి సూర్యరశ్మి ఎక్కువగా పడితే, తక్కువ బరువున్న ధనావేశిత మేఘాలు పైకి ఎగిరేస్తాయి. ఎక్కువ బరువున్న, ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్న రుణావేశిత మేఘాలు కిందకు జారుకుంటాయి. అంటే, మనం చూసే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయి.
శాస్త్రం ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతాయి. అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు పోయినప్పుడు, సమీపంలో ఏ వస్తువు ఉన్నా దానివైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి.
ఈ క్రమంలోనే, మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై, విద్యుత్ క్షేత్రంగా మారి, భూమికి దూసుకొస్తాయి. ఇదే 'పిడుగు పడటం'. మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలైన సమయంలోనే ఉరుములు, మెరుపులు సంభవిస్తాయి.
మేఘాల నుంచి పడే 'పిడుగుల్లో' సుమారు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. ఇది మనిషిని అక్కడికక్కడే చంపి బూడిద చేయగలదు. ప్రధానంగా ఎండాకాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. నాసా పరిశోధనలో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉందని తేలింది.
0 Comments