What is Bull Market and Bear Market..? Explained in Telugu

- మనం పేపర్లలో లేదా టి.విలలో చూస్తూ ఉంటాము - బుల్ మార్కెట్ (ఎద్దు బొమ్మ), బేర్ మార్కెట్ (ఎలుగుబంటి బొమ్మ) అని. ఈ పదాల అర్థం ఇప్పుడు మనం తెలుసుకోవాలి.
బుల్ మార్కెట్ (Bull market) :
- స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్ మరియు నిఫ్టీలు మార్కెట్ సెంటిమెంట్ యొక్క బేరోమీటర్లుగా పరిగణించబడతాయి. పెట్టుబడిదారుల ఆశావాదాన్ని సూచిస్తూ అవి స్థిరంగా పైకి కదులుతున్నప్పుడు, దానిని బుల్ మార్కెట్ అంటారు.
- బుల్ మార్కెట్‌లో, స్టాక్ ధరలు పెరుగుతూనే ఉంటాయని పెట్టుబడిదారులు విశ్వసిస్తారు మరియు మరిన్ని షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నారు.
- మార్కెట్ ఆశావాదం ఉన్న ఈ కాలంలో దాదాపు అన్ని కంపెనీ షేర్ల ధరలు పెరుగుతాయి.
బేర్ మార్కెట్ (Bear Market):
- సెన్సెక్స్ మరియు నిఫ్టీ వరుసగా నష్టాల్లో కదిలేట్లైతే, ఆ పరిస్థితిని 'బేరిష్ మార్కెట్' అని పిలుస్తారు. లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు భయపడి తమ షేర్లను అమ్మేసే పరిస్థితి ఏర్పడితే, అది 'బేరిష్ మార్కెట్' అవుతుంది.
- అలాంటి సమయంలో, పెద్దఎత్తున షేర్ల ధరలు పడిపోతాయి. పెట్టుబడిదారులందరూ భయపడి తమ షేర్లను అమ్మేయడానికి సిద్ధపడతారు. స్టాక్ మార్కెట్ మొత్తం నష్టాల్లోనూ, భయాందోళనల్లోనూ ఉంటుంది.

- స్టాక్ మార్కెట్లో లాభాలున్నప్పుడు, దానిని బుల్ మార్కెట్ అంటారు. ఎందుకంటే, ఎద్దు తన ప్రత్యర్థిని కొమ్ములతో పైకి లేపి విసిరేస్తుంది. ఇది షేర్ల ధరలను పైకి తీసుకువెడతుంది.
- అలాగే, స్టాక్ మార్కెట్లో నష్టాలున్నప్పుడు, దానిని బేర్ మార్కెట్ అంటారు. ఎందుకంటే, ఎలుగుబంటి తన శత్రువులను పై నుండి కిందకు లాగివేస్తుంది. ఇది షేర్ల ధరలను కిందకు తీసుకువెడతుంది.
.jpg)
- స్టాక్ మార్కెట్‌లో బుల్స్ మరియు బేర్స్ పోటీపడతారు. బుల్స్ అంటే మార్కెట్ పెరుగుతుందని నమ్మే వారు. బేర్స్ అంటే మార్కెట్ పతనమవుతుందని భావిస్తే వారు.
- ఒక రోజులో ఎక్కువ షేర్ల కొనుగోలు జరిగి, షేర్ ధరలు పెరిగితే ఆ రోజున బుల్స్ గెలుపొందారని అర్థమవుతుంది. ఒక రోజులో ఎక్కువ షేర్ల అమ్మకాలు జరిగి, షేర్ ధరలు పడిపోతే ఆ రోజున బేర్స్ గెలుపొందారని అర్థమవుతుంది.
షేర్ మార్కెట్ పరిస్థితిని, మార్కెట్ ట్రెండ్‌ను సూచించడానికి, బుల్స్ మరియు బేర్స్‌ను వాడుతారు.
0 Comments