Betting Apps:ఆన్‍లైన్ బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి.

           ఆన్‍లైన్ బెట్టింగ్ వల్ల చాలా కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి


మనం సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ టెక్నాలజీని సమాజానికి మంచికి కాకుండా చెడు పనులకు వాడుతున్నాం. ముఖ్యంగా, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, స్మార్ట్ ఫోన్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లు కూడా పెరిగాయి. ఇలాంటి లోన్ యాప్‌ల నుంచి డబ్బులు తీసుకుని, వేధింపులకు గురికాక, ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడురు మండలం రామునిపట్లలో ఓ కానిస్టేబుల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో తనను తాను మాత్రమే కాదు, భార్యను, పిల్లలను కూడా చంపేశాడు. ఈ ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. ఇది ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల పరిణామాలను మరోసారి ముందుకు తెచ్చింది.

కమలేష్ కుటుంబం ఒక్కటే బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడింది కాదు. గోల్నేపల్లిలోని గ్రామానికి చెందిన ఓ మహిళ ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆడి తన డబ్బులు పోగొట్టుకుంది. అవిశేషం మల్లేశం, అతని భార్య రాజేశ్వరి, కుమారులు అనిరుద్, హర్షవర్ధన్ ఈ గ్రామానికి చెందినవారు. మల్లేశం లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో, వారు చౌటూప్పల్‌లోని మల్లికార్జునగర్‌లో అద్దె ఇల్లులో నివసిస్తున్నారు. మల్లేశం ప్రాంతానికి దూరంగా పనిచేస్తుండటంతో, రాజేశ్వరి పిల్లలతోనే ఉండేది. ఈ క్రమంలో ఆమె తన ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి అలవాటు పడింది.

ఇల్లా బెట్టింగ్ మాయలో ఫాడి మోసపోకుండి, మీకు వెనుక మీ కుటుంబం ఉంటుంది వాళ్ల గురించి ఒకసారి ఆలోచించండి.

Post a Comment

0 Comments