.png)
Best Protein Food for Body Building:
ప్రతి ఒక్కరికి బలంగా దృఢంగా కనిపించాలని ఉంటుంది. శరీరం బలహీనంగా ఉండేవారిలో కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. మన మనసు బలంగా ఉండాలంటే ముందు శరీరం బలంగా ఉండాలి.బలమైన శరీరాన్ని సంపాదించుకోవడానికి చాలా మంది జిమ్‌లో చేరి కష్టపడుతుంటారు. కానీ కొందరు ఎంత కష్టపడినా వారి శరీరంలో ఎటువంటి పెరుగుదల కనిపించదు. దీనికి కారణం, జిమ్‌లో ఎక్కువగా శ్రమించినా సరైన ఆహారాన్ని తీసుకోకపోవడమే. గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే, బాడీ బిల్డింగ్ అనేది 80% మనం తీసుకునే ఆహారం మీదుగా, మిగిలిన 20% మనం చేసే వ్యాయామం మీదుగా ఆధారపడి ఉంటుంది. అది కూడా సరైన ఆహారం తీసుకోవలసి ఉంటుంది. శరీరం పెరగడానికి ఏ ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుడ్లు (Eggs):

గుడ్లలో శరీర పెరుగుదలకు కావలసిన అన్ని ప్రోటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అలాగే తక్కువ ధరకు దొరికే మంచి ఆహారం కూడా. కాబట్టి ఉడకపెట్టిన గుడ్లను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.
2. అరటిపళ్లు (Banana) :
.jpg)
అరటిపళ్ళు శరీర పెరుగుదలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ముఖ్యంగా బరువు పెరగడానికి. చాలా మంది పొందాల్సిన బరువుకంటే తక్కువ బరువుతో ఉంటారు. అలాంటి వారికి అరటిపళ్ళు బరువు పెరగడానికి చాలా సహాయపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత అరటిపళ్ళు తినడం బరువును పెంచుకోవడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
3. పాలు - పాలకు సంబందించిన పదార్దాలు (Milk):

పాలను పూర్తి ఆహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే, పాలు ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. కాబట్టి, పాలను ఎక్కువగా తీసుకోవాలి. మరియు, పాలలోని కాల్షియం ఎముకలను బలపరచడంలో సహాయపడుతుంది. పాలు మాత్రమే కాకుండా, పెరుగు, నెయ్యి వంటి పాల పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
4. బీన్స్ (Beans):

ఈ తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్ కలిగిన బీన్స్‌ను ప్రతిరోజూ మీ ఆహారంలోకి చేర్చుకోవాలి. రోజుకు ఒక కప్పు బీన్స్‌ను ఉడకబెట్టి లేదా కూరగా చేసి తినండి. వీటిలోని ప్రొటీన్లు పిల్లల కండరాల పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అలాగే, వివిధ రకాల వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. మరింతగా, మొలకెత్తిన గింజలను కూడా తినాలి.
5. చేపలు (Fish):
.jpg)
చేపలు మాంసాహారంలో చాలా ఉపయోగకరమైనవి. వీటిలోని omega-3 కారక ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ప్రత్యేకించి ట్యూనా, సాల్మన్ వంటి చేపలు చాలా మంచివి. చేపల్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు కండరాలను బలంగా పెంచుతాయి.
6. పీనట్ బటర్ (Peanut Butter):
.jpg)
దీనిని వేరుశనగ గుళ్ళతో తయారు చేస్తారు. ఇది క్రీమ్ వంటిదే ఉంటుంది. పీనట్ బటర్‌తో బ్రెడ్‌పై వేసుకుంటే బాగుంటుంది. ఇది మన శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే బ్రెడ్ మరియు పీనట్ బటర్‌తో హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేయవచ్చు.
7. బాదం (Almond):
.jpg)
బాదంలో ప్రోటీన్ల పక్కన మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మెటాబాలిజంకు చాలా సహాయపడుతుంది. ప్రతి రోజు రాత్రిపూట 5 లేదా 6 బాదం గింజలను నీటిలో నానబెట్టి, తర్వాత ఉదయాన్నే తినడం చాలా మంచిది.
8. చిలకడ దుంపలు (Sweet Potato):

వీటిని కాల్చినవేవీ లేదా ఉడకపెట్టినవేవీ తినవచ్చు. శరీర పెరుగుదలకు మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా వీటిలో చాలా మంచిది ఉంటుంది. కూరగాయాల్లో ఇది ఒక సంపూర్ణ ఆహారం. విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, సాధ్యమైనంత ఎక్కువుగా వీటిని తినాలి.
మీరు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా దృఢమైన శరీరాన్ని పొందవచ్చు. వ్యాయామం చేస్తూనే, ఆకుకూరలు మరియు పళ్ళు వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా, నీటిని ఎక్కువగా త్రాగడం ద్వారా, మరియు తగినంత నిద్ర పొందడం ద్వారా మీరు మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చు. ఈ జీవనశైలి మార్పులతో, మీరు దృఢమైన శరీరాన్ని పొందడానికి మీరు కలిగిన కోరిక త్వరగా నెరవేరుతుంది.
Thank You
0 Comments