Time Management in Telugu..
Time Management in Telugu
- ఒకసారి చెయ్యి జారిపోతే తిరిగి రానిది ఏదైనా ఉంది అంటే అది కాలం మాత్రమే. కాలాన్ని నిరంతరం సద్వినియోగ పరుచుకోవాలి.
- సమయాన్ని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తపడే వారే విజేతలుగా నిలుస్తారు.
- మనలో చాలా మంది "Time is not Enough" అని అనుకుంటారు. అయితే ఇది సరైన వాదన కాదు. సమయం అందరికీ సమానంగా లభిస్తుంది. పేదవాడి నుండి ధనవంతుడి వరకు అందరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి.
- కాలాన్ని విలువైనదిగా భావించి జాగ్రత్తగా వాడుకుంటే, మనం గొప్పవాళ్ళమై ఎదుగుతాం. లేకపోతే సామాన్యులుగానే మిగిలిపోతాం.
కాలం దుర్వినియోగం అవ్వడానికి కారణాలు?
1. అతి నిద్ర
- రాత్రి 10 గంటలకు పడుకుని, ఉదయం 7 గంటలకు లేస్తే ఒక్కసారిగా టెన్షన్‌పడి, హడావుడి చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ రాత్రి చేసి ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు అని అనుకున్నాను ఎన్నోసార్లు.
- కాబట్టి, రోజూ తెల్లవారుఝామున 12 గంటల వరకు పడుకోకూడదని, 5 తర్వాత మంచం మీద ఉండకూడదని నిర్ణయించుకుంటే, రోజుకు 4 గంటలు, సంవత్సరానికి 60 రోజులు అంటే 2 నెలల సమయాన్ని సంపాదించుకున్నట్లే.
చరిత్రలో గొప్ప స్థానం పొందిన ప్రశస్తులైన వారందరూ రోజూ కేవలం ఐదు నుండి ఆరు గంటల నిద్ర మాత్రమే పోయేవారు.
.2. బద్ధకం
మనలో బద్ధకం ఒక ప్రధాన కాలహరణంగా మారిపోతుంది. సాధారణంగా, మనస్సు సుఖాన్ని కోరుకుంటుంది, బుద్ధి మాత్రం మన హితాన్ని కోరుకుంటుంది అని చెబుతారు.
ఉదాహరణకు, ఉదయం 5 గంటలకు లేచిపోవాలని బుద్ధి చెబుతుంది. అయితే, మనస్సు మాత్రం కొంతసేపు మరి పడుకోవచ్చు, ఏమీ పర్వాలేదు అని చెబుతుంది. ఇలాంటిప్పుడు, మనం బుద్ధి మాటను పట్టించుకోవాలి, మనస్సు మాటను వినకూడదు. లేదంటే ఇలాంటి అనర్థాలు మనలను వెంటాడుతూనే ఉంటాయి.
3. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయడం
- ఏదైనా పనిని చేసేటప్పుడు శ్రద్ధగా చేస్తే, ఆ పనిని మళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. చేసిన పనిని మళ్లీ చేయడం వృధా సమయానికి దోహదం చేస్తుంది, మరియు మన ఏకాగ్రత లోపాన్ని తెలియజేస్తుంది. దినచర్యను ప్రణాళికాబద్ధంగా రాసుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
- ఉదాహరణకు, ఒక చోటికి వెళ్లాలంటే అక్కడ చేయాల్సిన పనులన్నీ ఒక కాగితంపై రాసుకుని వెళ్లినట్లయితే, అన్ని పనులను ఒకేసారి పూర్తి చేసుకోవచ్చు.
4. సోషల్ మీడియాకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం
- ప్రస్తుత కాలంలో, యువత విజ్ఞానానికి కంటే వినోదాలపైనే ఎక్కువ సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. జియో వచ్చిన తర్వాత మరింతగా, ఉచిత ఇంటర్నెట్‌తో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, గేమ్స్‌లతో సమయాన్ని గడపడం పెరిగింది. మీరు ఈ సమయాన్ని మీ లక్ష్యాల సాధనకు వినియోగిస్తే, ఊహించిన కంటే ముందే వాటిని సాధించవచ్చు.
- గుర్తుంచుకోండి, సోషల్ మీడియా అంటే మన జీవితాలను బయటపెట్టడం, ఇతరుల జీవితాలను తెలుసుకోవాలనే కుతూహలం మాత్రమే. వాటికి తగిన ఉపయోగం లేకుంటే, మిగిలిన సమయం వృథాగా గడుస్తుంది.
5. అనవసరపు మాటలు తగ్గించుకోవడం
- మనలో కొంతమంది ఫోన్‌లో గంటలుగంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. వారు తమను ప్రత్యేకంగా చూపించుకోవాలని, తమ గురించి ఎన్నో గొప్పలు చెబుతూ ఉంటారు. లేదా తమ స్థాయిని పెంచుకోవడానికి ఇతరులను తక్కువగా చూసి మాట్లాడుతూ ఉంటారు.
- ఒకరోజు ఓ వ్యక్తి మరొకరితో సుమారు రెండు గంటలు మాట్లాడిన తర్వాత, "హమ్మయ్యా, మీతో మాట్లాడినంత సేపు నాకు తలనొప్పి వచ్చింది," అని అన్నాడు.
- దానికి రెండో వ్యక్తి, "అదేం పోలేదు, నాకు చుట్టుకుంది," అని అన్నాడు.
0 Comments