What Is Pradhan Mantri Jan Arogya Yojana Pm-Jay...?
ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనలో రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందుబాటులో ఉంది.
- ఆర్థిక వెనుకబడితనం ఉన్న వర్గాలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి, కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన'ను (పీఎం-జేఏవై) ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ యోజనలో రెండో దశగా ఈ పథకం ప్రవేశపెట్టబడింది.
ప్రధానాంశాలు:
- ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం.
- 10 కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం.
- లబ్దిదారులు 50 కోట్ల మందికి పైగానే ఉంటారని అంచనా.
- పైసా ఖర్చు లేకుండా ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చు.
- ఆర్థిక సాయం అందించడానికి, కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన'ను ప్రారంభించింది. ఈ పథకం కింద, ప్రతి కుటుంబానికి ఒక్కో సంవత్సరంలో రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తుంది.
- ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడం దీని లక్ష్యం.
- ఈ పథకం ఆయుష్మాన్ భారత్ యోజన రెండో దశగా ప్రారంభమైంది. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకమైన ఈ పీఎం-జేఏవై ద్వారా సుమారు 10 కోట్ల పేద కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
- ఈ పథకంలో చేరడానికి, సామాజిక-ఆర్థిక నిరుపేదలైన వారిని ఎంచుకుంటారు. ఈ పథకం కింద, దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా, లబ్ధిదారులు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు.
పీఎం-జేఏవై ఫీచర్లు....

- ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా, ప్రతి కుటుంబం ఒక్కో ఏడాదికి రూపాయల 5 లక్షల వరకు వైద్య చికిత్స పొందవచ్చు.
- ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) పథకం 10.74 కోట్లకు పైగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చుల కోసం నగదు రహిత ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తుంది. కుటుంబ పరిమాణం, వయస్సు లేదా లింగం ఆధారంగా ఎటువంటి పరిమితులు లేకుండా, మొదటి రోజు నుండి అన్ని ఆరోగ్య చికిత్సలను ఈ పథకం కవర్ చేస్తుంది. ఇది ఆసుపత్రిలో చేరడం నుండి డిశ్చార్జ్ వరకు మొత్తం ఖర్చుతో పాటు 15 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను భరిస్తుంది.
- ఈ పథకం కింద రోజువారీ కూలీలుగా పనిచేసే 16 నుండి 59 ఏళ్ళ వయసు గల వ్యక్తులు - బిచ్చగాళ్ళు, కూలీలు, నిర్మాణ కార్మికులు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, ప్లంబర్లు, బట్టలు ఉతికేవారు, తోటమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, రిక్షా తొక్కేవారు, కండక్టర్లు, వెయిటర్లు, అసిస్టెంట్లు, డెలివరీ అసిస్టెంట్లు, వీధి వర్తకలు, చిన్న సంస్థల్లో ఉద్యోగులు - లబ్ది పొందవచ్చు.
- ఇంకా, సంపాదకులు లేని కుటుంబాలు, ఆరోగ్యవంతులు లేని కుటుంబాలు, దివ్యాంగులు ఉన్న కుటుంబాలు, ఇల్లు లేనివారు, పట్టణాల్లో తమ పని ఆధారంగా ఎంపిక చేసిన వారు కూడా ఈ పథకం కింద లబ్ది పొందవచ్చు.
పీఎం-జేఏవై స్కీమ్‌కు ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
పీఎం-జేఏవై స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవాలంటే, ఈ క్రింది ప్రక్రియలను పాటించాలి:
- మీరు అర్హత కలిగి ఉన్నారా తెలుసుకోవడానికి, దయచేసి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ని సందర్శించండి. "నేను అర్హుడిని అవుతానా" అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేస్తే, మీకు ఓటీపీ పంపబడుతుంది. ఆ తర్వాత మీ రాష్ట్రం, పేరు, రేషన్ కార్డు నంబర్, ఇంటి నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఒకవేళ మీ కుటుంబం ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ అయితే, మీ పేరు డిస్‌ప్లే అవుతుంది.
టోల్ ఫ్రీ నెంబర్లు..
- పీఎం-జేఏవై పథకానికి అర్హత ఉన్నా లేదా అనేది తెలుసుకునేందుకు, మీరు ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌ను సంప్రదించవచ్చు.
లేదా 14555 నెంబర్‌కు ఆయుష్మాన్ భారత్ కాల్ సెంటర్‌కు లేదా 1800 111 565 నెంబర్‌కు ఫోన్ చేసి అడగవచ్చు.
0 Comments